: ధావన్ స్థానంలో రహానే


మొహాలీ టెస్టులో గాయపడ్డ విధ్వంసక ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో ముంబయి బ్యాట్స్ మన్ అజింక్య రహానే ఆడనున్నట్టు తెలుస్తోంది. రహానే.. గత 15 నెలలుగా భారత జట్టు సభ్యుడిగా ఉన్నా.. ఇంతవరకు టెస్టు గడప తొక్కనేలేదు.

ధావన్ చేతి వేళ్ళకు గాయమైన నేపథ్యంలో బీసీసీఐ ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించకపోవడంతో రహానే అరంగేట్రం చేసేందుకు రంగం సిద్ధమైనట్టే అని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. అయితే, రహానే.. మురళీ విజయ్ తో కలిసి ఇన్నింగ్స్ ఓపెన్ చేసే అవకాశాలు కనిపించడంలేదు. ఒకవేళ విజయ్ జతగా పుజారా ఓపెనింగ్ కు వస్తే రహానే మిడిలార్డర్ లో దిగుతాడని తెలుస్తోంది. 

  • Loading...

More Telugu News