: మరో రెండేళ్లు ఇన్వెస్టర్లకు శుభం.. 2016 వరకు సెబీ అధిపతిగా సిన్హా
ఇన్వెస్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు అనుక్షణం పాటుపడే సెబీ చైర్మన్ యూకే సిన్హా పదవీకాలాన్ని కేంద్ర సర్కారు పొడిగించింది. ఈ నెల 18తో సిన్హా పదవీకాలం పూర్తవుతుండగా.. 2016 వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గత మూడేళ్లుగా సిన్హా సెబీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇన్వెస్టర్ల మేలు కోరి ఆయన ఎన్నో సంస్కరణలను ప్రవేశపెట్టారు. మార్కెట్లో స్పెక్యులేషన్, మోసాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కేంద్ర సర్కారు నుంచి ప్రత్యేక అధికారాలను సాధించుకున్నారు. 25వేల కోట్ల రూపాయల మేర ఇన్వెస్టర్లకు బాకీ ఉన్న సహారా సంస్థ నుంచి వాటిని రాబట్టేందుకు ఏ మాత్రం రాజీపడకుండా నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సిన్హా 1975 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.