: కన్నుల పండువగా సాగిన పెద్దమ్మతల్లి రథోత్సవం
హైదరాబాదు నగరంలోని జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి 20వ వార్షిక రథ మహోత్సవం గురువారం రాత్రి వైభవంగా జరిగింది. అశేష జనవాహిని వెంట రాగా రథోత్సవం కన్నుల పండువగా సాగింది. అమ్మవారి ఉత్సవ మూర్తిని పల్లకీలో ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తీసుకువచ్చారు. రథోత్సవానికి ముందు చిన్నారులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యుద్దీపాలంకరణతో ఆలయ పరిసరాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి.