: పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ కు సుప్రీం నోటీసు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు పరువు నష్టం దావా కేసులో నోటీసు పంపింది. అంతేగాక ఢిల్లీ విద్యా శాఖ మంత్రి మనీష్ శిశోడియా, ఆమ్ ఆద్మీ నేతలు ప్రశాంత్ భూషణ్, షాజియా ఇల్మీలకు కూడా నోటీసులు ఇచ్చింది. వొడాఫోన్ సంస్థకు లాభం చేకూరేలా కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ అనుకూలంగా వ్యవహరించారంటూ ఈ నలుగురూ ఆరోపణలు చేసినట్లు ఆయన కుమారుడు అమిత్ సిబాల్ కొన్ని రోజుల కిందట పిటిషన్ వేశారు. పిటిషన్ ను ఈ రోజు విచారించిన కోర్టు నోటీసులు జారీ చేసింది. దాంతో, ఈ కేసులో నేటి నుంచి ఆ నలుగురిపై ట్రయల్ కోర్టులో విచారణ కొనసాగనుంది.