: గోదావరిఖనిలో ప్రారంభమైన కోల్ ఇండియా షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు
కోల్ ఇండియా షటిల్, బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలోని ఆర్.సీ.వో.క్లబ్ లో ఈ పోటీలను సింగరేణి ఫైనాన్స్ డైరెక్టర్ వివేకానంద్ ప్రారంభించారు. సింగరేణి సహా దేశవ్యాప్తంగా ఉన్న కోల్ ఇండియా కంపెనీలకు చెందిన 10 జట్లు ఈ పోటీలకు హాజరయ్యాయి. మూడు రోజులపాటు జరుగుతున్న ఈ పోటీలకు సింగరేణి కంపెనీ ఆతిథ్యమిస్తోంది.