: నెట్ లో అశ్లీల వీడియో కనిపించిందా.. జాగ్రత్త


సైబర్ కేటుగాళ్లు నెట్ లో పొంచి ఉన్నారు. జాగ్రత్తలు తీసుకోకుంటే మాటువేసి నిలువునా దోచేస్తారు. లైంగికపరమైన వార్తలు, వీడియోలంటే నెటిజన్లలో ఎక్కువ మందికి ఆసక్తి. ఇదే టోకరాగాళ్లకు అచ్చి వస్తోంది. నెట్ బ్రౌజింగ్ సమయంలో అశ్లీల వీడియో, లేదా చిత్రాలు కనిపించేలా చేస్తారు. ఆసక్తి కొద్దీ క్లిక్ కొడితే.. అక్కడున్న చిత్రాలు రెచ్చిపోయేలా చేస్తాయి. వాటిని చూడాలంటే కొంత మొత్తం చెల్లించాలనే నిబంధన కనిపిస్తుంది. కొద్ది మొత్తమే కదా అని ఆవేశంతో చెల్లించేస్తే వారికి దొరికిపోయినట్లే. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు వాటి వివరాలను ఆ సైట్ పేమెంట్ గేట్ వేలో ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా తర్వాత వారు మీ బ్యాంకు ఖాతాలో ఉన్నదంతా ఊడ్చేస్తారు. హైదరాబాద్ లోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ కు ఇలాంటి దోపిడీ గురించే ఇటీవల ఒక ఫిర్యాదు అందింది. వారు విచారించగా.. ఈ అశ్లీల టోకరా వెలుగుచూసింది.

  • Loading...

More Telugu News