: ముఖ్యమంత్రికి చెప్పే తిరస్కరణ ఓటు వేశా: దగ్గుబాటి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పిన తర్వాతే రాజ్యసభ ఎన్నికల్లో తాను తిరస్కరణ ఓటు వేశానని కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. సీమాంధ్ర నేతల, ప్రజల మనోభావాలకు గౌరవం లేకుండా యూపీఏ ప్రభుత్వం విభజన బిల్లుపై నిర్ణయం తీసుకుందని అన్నారు. ప్రస్తుతం దగ్గుబాటి తిరస్కరణ ఓటు విషయం చర్చనీయాంశంగా మారింది.