: నాకు ఓటేయమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరా: కేకే
రాజ్యసభ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కోరినట్లు టీఆర్ఎస్ నేత కె.కేశవరావు తెలిపారు. అటు తెలంగాణ నేతల ఓట్లన్నీ తెలంగాణ అభ్యర్థికే వేస్తామని ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించిన క్రమంలో కేకేకు విజయం ఖాయంగా కనిపిస్తోంది.