: తిరస్కరణ ఓటు వేసిన దగ్గుబాటి
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు సంచలనానికి తెర తీశారు. ఈ ఎన్నికల్లో మొదటి సారి ప్రవేశపెట్టిన తిరస్కరణ ఓటును ఆయన వినియోగించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ఏ ఒక్క అభ్యర్థీ నచ్చకపోతే... ఎవరూ నచ్చలేదంటూ, తిరస్కరణ ఓటు వేయవచ్చు. ఓటు వేయడానికి వెళ్తున్న సమయంలోనే, తనకు ఏ అభ్యర్థికీ ఓటు వేయాలని అనిపించడం లేదని ఆయన స్పష్టం చేశారు. కాసేపు వేచి చేశారు. అనంతరం తిరస్కరణ ఓటు వేసి వచ్చారు.