: కేవలం యూటీ అంటే కుదరదు.. బిల్లులో చేర్చి అసెంబ్లీకి పంపండి: లగడపాటి
హైదరాబాదును యూటీ చేస్తామంటూ సాకులు చూపి... టీబిల్లును పాస్ చేసే యత్నంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఆరోపించారు. హైకమాండ్ కు చిత్తశుద్ధి ఉంటే, యూటీ అంశాన్ని బిల్లులో చేర్చి మరోసారి అసెంబ్లీకి పంపాలని డిమాండ్ చేశారు. పార్లమెంటులో బిల్లు పాస్ అయితే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటులో బిల్లును అడ్డుకోవడానికి సర్వశక్తులా కృషి చేస్తామని చెప్పారు.