: తెలంగాణ నేతల ఓట్లు తెలంగాణ అభ్యర్థికే: డిప్యూటీ సీఎం
విభజన నేపథ్యంలో సమైక్యమంటూ ముఖ్యమంత్రి సహా పలువురు సీమాంధ్ర నేతలు గళం వినిపిస్తుండటంతో, తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజ్యసభ ఎన్నికల్లో ఒక్కటయినట్లు తెలుస్తోంది. దాంతో, ఈ ఎన్నికల్లో తెలంగాణ నేతల ఓట్లు తెలంగాణ అభ్యర్థికేనని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. దీని ద్వారా తమ ఐక్యత నిరూపించుకుంటామని చెప్పారు. సీమాంధ్ర వారితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అంటే టీఆర్ఎస్ అభ్యర్థి కేకే విజయం ఖాయంగా కనిపిస్తోంది.