: కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసిచ్చిన ఎంపీ హర్షకుమార్
కీలకమైన టీబిల్లు పార్లమెంటుకు వస్తున్న నేపథ్యంలో, బిల్లును అడ్డుకోవడానికి సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు తమ వంతు ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీ హర్షకుమార్ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. లోక్ సభ స్పీకర్ మీరా కుమార్ కు ఆయన నోటీసును అందజేశారు. వ్యూహంలో భాగంగా, ప్రతి రోజు ఒక్కో సీమాంధ్ర ఎంపీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీబిల్లును ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుంటామని ఆత్మ విశ్వాసం వ్యక్తం చేశారు.