: రాజ్యసభ ఎన్నికల్లో వివిధ పార్టీల ఓట్ల కేటాయింపులు ఇవే
రాష్ట్రం నిలువునా చీలిపోయిన పరిస్థితుల్లో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో... వివిధ పార్టీలు తమ తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీల ఓట్లు కాపాడుకోవడానికి పార్టీలు పెద్ద సవాలే ఎదుర్కొంటున్నాయని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉండగా... ఒక్కో అభ్యర్థికి 46, 46, 47 ఓట్ల చొప్పున ఆ పార్టీ కేటాయించింది. మిగిలిన ఓట్లను టీఆర్ఎస్ అభ్యర్థి కేకేకు వేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీడీపీ తమ ఇద్దరు అభ్యర్థులకు, ఒక్కొక్కరికి 36 ఓట్ల చొప్పున కేటాయించింది.