: మధ్యంతర ఎన్నికలా... అవకాశమే లేదు!: నితీష్ కుమార్
యూపీఏతో డీఎంకే తెగతెంపులు చేసుకోవడంతో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ షికారు చేస్తున్న పుకార్లపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పందించారు. దేశంలో అసలు మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని కుండ బద్దలు కొట్టారు. డీఎంకే వైదొలగినంత మాత్రాన యూపీఏకు వచ్చిన నష్టమేమి లేదన్నారు. సర్కార్ పడిపోకుండా యూపీఏ వద్ద గట్టి ప్రణాళికలే ఉంటాయన్నారు. ఇక ఎప్పటిలాగే లోక్ సభ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయని నితీష్ స్పష్టం చేశారు.