: బ్రష్ చేసుకోవాలా.. ఈ క్యాప్ తలపై పెట్టుకోండి, అదే చేసేస్తుంది!


బారెడు పొద్దెక్కింది. భారంగా మంచంపై దొర్లుతూ కళ్లు తెరిచారు. లేవాలంటే బద్దకం. లేచి పళ్లు తోముకోవాలంటే మహా బద్దకం (అందరికీ కాదులేండి!). ఇలాంటి వారికో గుడ్ న్యూస్! మీరు కష్టపడి పళ్లు తోముకునే పని లేకుండా.. చక్కగా ఆ పని చేసి పెట్టే ఒక అద్భుత టోపీ ఆలోచనను బ్రిటన్ లోని బ్రిస్టల్ వర్సిటీకి చెందిన డిగ్రీ విద్యార్థి శామ్ హంటర్ బాక్స్ టర్ బుర్ర నుంచి బయటకు తీశాడు.

దీనికి ప్రేరణ ఏంటో తెలుసా.. శామ్ లోనూ.. అహనా పెళ్లంట చిత్రంలో కోట వలే ఒక మనిషి ఉన్నాడు. అందుకే ఒక రోజు.. ప్రతి రోజూ ఇలా ఇన్నేసి నిమిషాల చొప్పున పళ్లు తోముకోవడానికి ఖర్చు చేస్తూ పోతే నా జీవిత కాలంలో ఎన్ని రోజులు వృథా అవుతాయి? అని కూర్చుని లెక్కలేశాడు. 75రోజులని ఫలితం వచ్చింది. ఇంత సమయం ఎందుకు వ్యర్థం కావాలి? జీవితంలో ప్రతీ క్షణం అత్యంత విలువైంది కదా.. అనుకున్నాడు. పళ్లను తోమే టోపీ ఇలా తయారు చేయవచ్చంటూ డిజైన్ చేసి పెట్టుకున్నాడు.

దీనిని వాకీ అనే ఆవిష్కరణల పోటీకి పంపాడు. 300 ఆవిష్కరణలను పక్కకునెట్టి పళ్లు తోమే శామ్ టోపీ ఐడియానే విజేతగా నిలిచింది. శామ్ కు 10వేల పౌండ్లు(రూ. 10లక్షలు) బహుమతి దక్కింది. ఇప్పుడు ఈ ఐడియా నిజమైన ఉత్పత్తిగా కార్యరూపం దాల్చాల్సి ఉంది. అందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ మనం కాస్త ఓపిక చేసుకుందాం!

  • Loading...

More Telugu News