: వారెవ్వా.. పోప్ బైక్!
అది లక్షల రూపాయల బైకే. కానీ కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఎందుకలా? దానిపై పోప్ ఫ్రాన్సిస్ సంతకం చేశారు మరి. పైగా, అది ప్రపంచంలోనే పెరెన్నికగన్న హార్లే డేవిడ్సన్ బైక్. దీని సామర్థ్యం 1585 సీసీ. హార్లే డేవిడ్సన్ బైకులను ప్రారంభించి 110 ఏళ్లయింది. ఇందుకు గుర్తుగా ఆ సంస్థ పోప్ కు ఈ బైక్ ను బహుమానంగా అందించింది. ఆయన పేదల సంక్షేమం కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థకు దానం చేశారు. ఆ సంస్థ తరఫున బాన్ హమ్స్.. ఫ్రాన్స్ లోని పారిస్ లో బైక్ ను వేలానికి పెట్టగా 2.84లక్షల డాలర్ల (1.76 కోట్ల రూపాయల)కు అమ్ముడుపోయింది.