: మబ్బులు తొలగిపోయాయి.. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసవుతుంది: కేసీఆర్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఇవాళ (గురువారం) సాయంత్రం తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ ఒక్కరే 10 నిమిషాల పాటు రాష్ట్రపతితో చర్చించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలోని సమస్యలను కేసీఆర్ ఈ సమావేశంలో ప్రణబ్ వద్ద ప్రస్తావించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుకు సంబంధించి చిన్న చిన్న అడ్డంకులు కల్పించినా.. అధిగమించి తెలంగాణ కల సాకారం చేయాలని ఆయన ప్రణబ్ ముఖర్జీని కోరారు. రాజ్యాంగ ప్రక్రియలో సఫలమై తెలంగాణ కల సాకారమవుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘మబ్బులు తొలగాయి.. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసవుతుంది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.