: ఇరానీ కప్ సందర్భంగా టీమిండియాను ఎంపిక చేస్తారట


ఈ నెలాఖర్లో జరిగే ఆసియా కప్, వచ్చే నెలలో జరిగే టి20 వరల్డ్ కప్ టోర్నీలలో పాల్గొనే భారత జట్టును ఇరానీ కప్ మ్యాచ్ సందర్భంగా ఎంపిక చేయనున్నారు. ఈ మ్యాచ్ బెంగళూరులో ఈ నెల 9 నుంచి 13 వరకు రంజీ చాంప్ కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా జట్ల మధ్య జరగనుంది. ఈ సందర్భంగా బెంగళూరులో సమావేశమయ్యే నేషనల్ సెలక్టర్లు టీమిండియాను ఎంపిక చేస్తారు. టీ20 టోర్నీకి జట్టును ఎంపిక చేసేందుకు ఐసీసీ ఫిబ్రవరి 15ను డెడ్ లైన్ గా విధించిందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ వరల్డ్ టోర్నీ మార్చి 16 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనుంది. ఇక ఆసియా కప్ ఫిబ్రవరి 25 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఈ రెండు టోర్నీలకు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనుంది.

  • Loading...

More Telugu News