: ముంబయి క్యునెట్ స్కాంలో ఈడీ కేసు నమోదు


ముంబయిలో సంచలనం సృష్టించిన రూ.425 కోట్ల క్యునెట్ ఆర్థిక స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ తాజాగా మనీ లాండరింగ్ (అక్రమార్జన) కేసును నమోదు చేసింది. ఇప్పటికే ఈ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్ మైఖేల్ ఫెరీరాని ముంబయి పోలీసులు విచారణ చేస్తున్నారు. అటు బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ కుమారుడు దానేష్ ఇరానీకి కూడా ఈ స్కాంలో సంబంధాలున్నాయని ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News