: వర్శిటీల్లో 4,700 ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయాల్సివుంది: రాష్ట్రపతి


దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్శిటీల్లో 4,700 ఫ్యాకల్టీ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో సెంట్రల్ వర్శిటీల వైస్ చాన్సలర్లతో ఆయన నేడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్ సహా 40 వర్శిటీల వైస్ చాన్సలర్లు విచ్చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, ఎన్నో వర్శిటీలలో ఫ్యాకల్టీ కొరత నెలకొని ఉందని పేర్కొన్నారు. గతేడాది 6,422 పోస్టుల కొరత ఉండగా కేవలం వాటిలో 25 శాతం మాత్రమే భర్తీ అయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ప్రపంచ విద్యారంగంలో నెంబర్ వన్ గా నిలవాలంటే నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. విద్య అనేది హోదాను ప్రతిబింబించేది కాదని, అది అందరి హక్కు అని నొక్కి చెప్పారు.

  • Loading...

More Telugu News