: తాలిబాన్లతో శాంతి చర్చలు ప్రారంభించిన పాకిస్థాన్
పాకిస్థాన్ సర్కారు తాలిబాన్లతో శాంతి చర్చలకు శ్రీకారం చుట్టింది. దేశంలోని తెహ్రిక్ తాలిబాన్ ఉగ్రవాద గ్రూపుతో నేడు చర్చలు మొదలుపెట్టింది. తాలిబాన్ల తరపున మౌలానా సమీవుల్ హక్ చర్చల్లో పాల్గొన్నారు. పాకిస్థాన్ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు పెరిగిపోతుండడంతో, సైనిక చర్య చేపట్టాలన్న డిమాండ్ కు ప్రజల మద్దతు లభిస్తున్న నేపథ్యంలో చర్చలు జరగడం విశేషం.