: ప్రైవేటు బస్సులను మార్గమధ్యంలో ఆపొద్దు: హైకోర్టు ఆదేశం


ప్రైవేటు బస్సులపై ఆర్టీఏ తనిఖీలను ముమ్మరం చేసిన విషయం విదితమే. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు బస్సులపై తనిఖీలను రవాణా శాఖాధికారులు కొనసాగిస్తున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకుంటున్నారు. జరిమానాలు విధించడం, బస్సులను సీజ్ చేయడం వంటివి చేస్తూనే ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో పాలెం వద్ద జరిగిన వోల్వో బస్సు దుర్ఘటన అనంతరం ప్రయాణికుల భద్రతపై రాష్ట్రమంతటా రవాణాశాఖాధికారులు తనిఖీలను మరింత పెంచారు.

ప్రైవేట్ ట్రావెల్స్ అసోసియేషన్ దీనిపై హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ పిటీషన్ ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. నేషనల్ పర్మిట్ ఉన్న బస్సులను మార్గమధ్యంలో ఆపవద్దని ఆర్టీఏ అధికారులను కోర్టు ఆదేశించింది. దీంతో ప్రైవేట్ టావెల్స్ వారికి కొంత ఊరట లభించినట్లయింది.

  • Loading...

More Telugu News