: హైదరాబాదులో మరో వారం పాటు నిషేధాజ్ఞలు అమలు
హైదరాబాదు పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో వారం పాటు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సభలు, సమావేశాలు, ప్రదర్శనలు అనుమతి లేకుండా నిర్వహించరాదని తెలిపారు. ఏవైనా బహిరంగ కార్యక్రమాలు నిర్వహించాలంటే పోలీసులు అనుమతి అవసరమని ఆయన స్పష్టం చేశారు.