: 12న ఢిల్లీకి గవర్నర్
రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఈ నెల 12న ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. రాష్ట్ర పునర్వ్యస్థీకరణ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశమున్న నేపథ్యంలో గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 12 నుంచి 15 వరకు ఆయన ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పరిస్థితులను పరిశీలించనున్నారు.