: శంకరరావు ఆరోగ్యం ఆందోళనకరం


భూవివాదం కేసులో నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకరరావు ఆరోగ్యం ఆందోళనకరంగా వున్నట్టు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో బాటు ఆయన లో-బీపీతో కూడా బాధపడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఆల్వాల్ లోని గ్రీన్ ఫీల్డ్ కాలనీలోని 75 ఎకరాల భూమిపై శంకరరావుకూ, కాలనీ సంఘ ప్రతినిధులకు మధ్య న్యాయస్థానాల్లో గత 18 ఏళ్లుగా వివాదం రగులుతోంది. దీనికి సంబంధించి విచారణ నిమిత్తం పోలీసులు ఆయనను నిన్న అదుపులోకి తీసుకున్నారు. అయితే, శంకరరావు అరెస్టు వ్యవహారంలో పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల విపక్షాలతో బాటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా విరుచుకుపడుతున్నారు.  

  • Loading...

More Telugu News