: రేపు ఉదయం 9 నుంచి 4 గంటల వరకు రాజ్యసభ ఎన్నికలు
రాజ్యసభ ఎన్నికలు రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి 4 గంటల వరకు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఈ మేరకు అసెంబ్లీ సెక్రెటరీ ఎస్ సదారాం తెలిపారు. అయితే, ఈ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు వినియోగించుకోవచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, అసోం రాష్ట్రాలకు ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో ఏపీలోని ఆరు స్థానాలకు కాంగ్రెస్ నుంచి ముగ్గురు, టీడీపీ నుంచి ఇద్దరు, టీఆర్ఎస్ నుంచి ఒకరు నామినేషన్ వేశారు.