: నదిలోకి దూసుకెళ్లిన బస్సు... 14 మంది దుర్మరణం
ఓ బస్సు నదిలో పడిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన నేపాల్ లో ఇవాళ (గురువారం) ఉదయం జరిగింది. 20 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బస్సు పల్పా జిల్లాలో ఉన్న కాళుకోలా నదిలో బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ బలగాలు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.