: రెండ్రోజుల్లో రూ. 6.75 కోట్ల ప్రజాధనం వృథా.. టీబిల్లే కారణం


ఈరోజు (రెండో రోజు) లోక్ సభ కేవలం 15 నిమిషాలు మాత్రమే కొనసాగి రేపటికి వాయిదా పడింది. ఈ రోజుతో పోలిస్తే నిన్నే నయం... ఎందుకంటే కనీసం 34 నిమిషాల పాటైనా కొనసాగింది. రెండ్రోజులకు గాను ఇప్పటికే 670 నిమిషాలు వేస్ట్ అయ్యాయి. దీనికంతా కారణం ఒకటే... మన రాష్ట్ర విభజన బిల్లు. సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టడం... గందరగోళం సృష్టించడం. దీనికి తోడు, యూపీఏ ప్రభుత్వం మెడ మీద వేలాడుతున్న అవిశ్వాస తీర్మానం కత్తి! ఏదేమైనప్పటికీ, సభ నడవకుండా ఉన్నందుకు ఈ రెండ్రోజుల్లో వృథా అయిన ప్రజాధనం అక్షరాలా రూ. 6.75 కోట్లు. సమావేశాలు ముగిసేలోపు మన డబ్బు ఇంకెంత వేస్టవుతుందో?

  • Loading...

More Telugu News