: ఈ నెల 10న అమలాపురంలో బహిరంగ సభ: అశోక్ బాబు
ఈ నెల 10న అమలాపురంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. రాజ్యసభ ఎన్నికల తర్వాత కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా తమ కార్యాచరణ ఉంటుందని చెప్పారు. కేంద్రమంత్రులు పార్లమెంటులో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ వ్యవస్థలు కలసి రావాలని అశోక్ బాబు కోరారు. అంతేగాక రాజ్యసభలో బిల్లును పెట్టకుండా కేంద్ర మంత్రులు, ఎంపీలు అడ్డుకోవాలని కోరారు.