: ఆహారం ఉన్నా అందడం లేదు


భూమండలంపై ఉన్న దేశాల్లో కొన్ని పుష్కలమైన సంపదతో తులతూగుతుంటే, మరికొన్ని దుర్భర దారిద్ర్యంతో కునారిల్లుతున్నాయి. ముఖ్యంగా ఆహారలేమి ఆఫ్రికా దేశాలను అస్థిరతకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ నిజం నివ్వెరపరచకమానదు. ప్రపంచంలో ఉన్న యావత్ మానవాళికి తగినంత ఆహార రాశులు ఉన్నా, అవి అందరికీ అందడంలేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఓ ప్రపంచస్థాయి సదస్సులో ఈ అంశాలు చర్చించారు.

ఆర్ధిక అసమానతల కారణంగా కొన్ని దేశాల ప్రజలు తీసుకోవాల్సిన ఆహారం కంటే అధికంగా స్వీకరిస్తుండగా.. అత్యధిక దేశాల్లో తినాల్సిన దానికంటే తక్కువే అందుతోందని సామాజికవేత్తలు ఆందోళన వెలిబుచ్చారు. వ్యవసాయరంగం, ఆర్ధిక రంగంపైనా ఈ ప్రభావం ఉంటుందని వారు పేర్కొన్నారు. వ్యవసాయాధారిత దేశాల నుంచి లభ్యత తక్కువగా ఉన్న దేశాలకు ఎగుమతులు జరుగుతాయని, తద్వారా వ్యావసాయిక దేశాల్లో ఆహార భద్రతకు భరోసా ఉండదని, అది తప్పక ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News