: జగన్ పలాయనం చిత్తగించాడు: దేవినేని


సమైక్యవాదినంటూ సభల్లో ఊదరగొట్టే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తానని మాటిచ్చి... మడమ తిప్పాడని టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దీక్ష చేస్తానని చెప్పి తీరా సమయం వచ్చాక దీక్ష చేయకుండా పలాయనం చిత్తగించాడని ఎద్దేవా చేశారు. సమైక్యవాదినని చెప్పుకునే జగన్ ఆదాలకు ఎందుకు మద్దతు ఇవ్వలేదని దేవినేని ప్రశ్నించారు. జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, ఆయనను నమ్ముకుంటే నట్టేట మునగాల్సిందేనని విమర్శించారు. జగన్ స్వార్థం కోసం సమైక్యవాదినంటున్నాడు కానీ, వాస్తవానికి జగన్ విభజన వాదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News