: రాజ్ నాథ్ సింగ్ తో కేసీఆర్ భేటీ


బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీఆర్ఎస్ సభ్యుల బృందం కూడా భేటీలో పాల్గొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించాలని, పార్లమెంటులో బిల్లు ఆమోదానికి మద్దతు తెలపాలని కేసీఆర్ ఆయనను కోరారు. గతంలో తమ పార్టీ చెప్పిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. కాగా, ఈ ఉదయం బాబుకు ముందుగా అపాయింట్ మెంట్ ఇచ్చి, తనను నిర్లక్ష్యం చేయడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News