: ముంబయి వరుస పేలుళ్లలో భక్తల్ కు కస్టడీ
ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భక్తల్, అతని సహచరుడు అసదుల్లా అక్తర్ కు ప్రత్యేక మోకా (ఎంసిఒసిఎ) కోర్టు ముంబయి ఏటీఎస్ కస్టడీకి అప్పగించింది. 2011, జులై 13న చోటు చేసుకున్న ముంబయి వరుస పేలుళ్లలో వారిద్దరినీ రెండు రోజుల కిందట ఎన్ఐఏ నుంచి ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో, ఈ రోజు కోర్టు ముందు ప్రవేశపెట్టగా, ఈ నెల 18 వరకు వారిని విచారణకు అనుమతించింది. ఈ మేరకు ముంబయిలో మూడు చోట్ల జరిగిన బాంబు పేలుళ్లపై పూర్తిగా విచారణ చేయనున్నారు.