: సీఎం మార్పు వార్తలు అవాస్తవం: మంత్రి రఘువీరా
రాజ్యసభ ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ ను పదవి నుంచి తొలగిస్తారన్న వార్తలన్నీ పుకార్లే అని... వాటిలో వాస్తవం లేదని మంత్రి రఘువీరా రెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కిరణ్, చంద్రబాబు, జగన్, బొత్సలు కలసివెళ్లి రాష్ట్రపతిని కోరితే విభజన ఆగిపోతుందని చెప్పారు.