: ఢిల్లీని చూస్తే జగన్ కు భయం: ధూళిపాళ్ల
వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఢిల్లీ అంటే భయమని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ జగన్ ఢిల్లీ దీక్షను ఎందుకు ఉపసంహరించుకున్నారో తెలపాలని డిమాండ్ చేశారు. సోనియా ముందు మాట్లాడాలంటే జగన్ కు నోరు పెగలదని అన్నారు. ఆదాలను గెలిపించాల్సి వచ్చినప్పుడు కూడా వైఎస్సార్సీపీ ఎందుకు వెనక్కి తగ్గిందని ఆయన ప్రశ్నించారు. జగన్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాడనడానికి ఇంతకంటే సాక్ష్యం మరొకటి లేదని ధూళిపాళ్ల అన్నారు. జగన్ సమైక్యవాదం ముసుగులో విభజన వాదని ఆయన మండిపడ్డారు.