: నా భర్తే నన్ను చంపేస్తాడేమో?: ఎమ్మెల్యే వెంకటరమణ భార్య సునీత
తన భర్త నుంచి ప్రాణహాని ఉందంటూ జీవిత సహచరి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. ‘నాతిచరామి’ అంటూ పెళ్లినాడు ప్రమాణం చేసిన ఆ భర్త ఆగడాలను సహించలేకపోయింది. పుష్కరానికి పైగా కాపురం చేసిన ఆమె.. అతడు పెట్టే బాధలను భరించలేక చివరకు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.
కైకలూరు ఎమ్మెల్యే వెంకటరమణతో తనకు పదిహేనేళ్ల క్రితం వివాహమైందని సునీత తెలిపారు. పెళ్లినాటి నుంచి ఇబ్బందులు పెట్టినా ఇంతకాలం సహించానని, ఇప్పుడు తనను చంపేస్తానంటూ భర్త బెదిరిస్తున్నాడంటూ ఆమె వాపోయింది. తననెన్ని బాధలు పెట్టినా భరించానని, పిల్లలను కూడా కష్టపెట్టడంతో కంప్లయింట్ ఇవ్వక తప్పని పరిస్థితిలోనే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినట్లు ఆమె చెప్పారు. ప్రజా ప్రతినిధి అయిన వెంకటరమణ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సునీత పెనమలూరు పీఎస్ లో ఫిర్యాదు చేసింది.