: పెరుగు, జున్నుతో మధుమేహ నియంత్రణ


మధుమేహం ఉన్నవారు కొవ్వు, తీపి పదార్థాలకు దూరంగా ఉండమని సూచిస్తుంటారు. అయితే, పెరుగు, తక్కువ కొవ్వు ఉండే జున్నుతో మధుమేహాన్ని పావు శాతం తగ్గించవచ్చని కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అసలు పెరుగు తీసుకోని వారికంటే... అధికంగా పెరుగును తినే బాధితుల్లో టైప్ 2 మధుమేహం 28 శాతం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే, తక్కువ కొవ్వు ఉండే పెరుగు సహా పులిసిన అన్ని రకాల పాల ఉత్పత్తులను తీసుకున్నా 24 శాతం మధుమేహం తగ్గుతుందని అధ్యయనంలో గుర్తించారు. 25వేల మందికిపైగా పురుషులు, మహిళలపై ఈ అధ్యయనం జరిగింది. మధుమేహ నియంత్రణలో ఆహార పదార్థాల పాత్రను తెలుసుకోవడానికి తమ పరిశోధన ఉపకరిస్తుందని శాస్త్రవేత్త నీతాఫొరోహీ అన్నారు.

  • Loading...

More Telugu News