కన్నడ టీవీ నటి హేమశ్రీ హ్యతకేసులో నిందితుడు, ఆమె భర్త సురేంద్రబాబుకు కర్ణాటక హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించింది. అతను పెట్టుకు
న్న బెయిల్ పిటిషన్ ను న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీధరరావు కొట్టివేశారు. ఇదే కేసులో బెయిల్ కావాలంటూ సురేంద్ర చేసుకున్నఅభ్యర్ధనను తొమ్మిదవ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఫిబ్రవరి 4న నిరాకరించింది. 2012 అక్టోబర్ లో అనంతపురం నుంచి కారులో వస్తున్న సమయంలో నటి హేమాశ్రీ అనుమానాస్పద పరిస్థితులలో మరణించింది.