: కర్ణాటకలోని ఇనుప ఖనిజం ఎగుమతి కంపెనీలపై సీబీఐ దాడులు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కర్ణాటకలోని పన్నెండు ఇనుప ఖనిజ ఎగుమతి కంపెనీలపై సీబీఐ మెరుపు దాడులు ప్రారంభించింది. ఏడాదికి 50వేల మెట్రిక్ టన్నులు ఎగుమతి చేస్తున్న కంపెనీలలో సోదాలు చేస్తున్న సీబీఐ, ఈ మేరకు బళ్లారి బీఎంఎం, బెంగళూరు వీఎస్ఎల్, హోస్ పేట్ లోని ఎంఎస్ పీఎల్ కంపెనీలలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.