: తెలుగు వారి భవిష్యత్తును వేరే భాషల వారు ఎందుకు నిర్ణయించాలి?: కాసు
తెలుగు ప్రజల భవిష్యత్తును వేరే భాషలు మాట్లాడే నేతలు ఎందుకు నిర్ణయించాలని మంత్రి కాసు కృష్ణారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, శాసనసభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడం అనైతికమని అన్నారు. తప్పుల తడకగా ఉన్న బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే నైతిక హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని ఆయన నిలదీశారు. రెండు ప్రాంతాల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తే విభజనపై అపోహలు తొలగిపోతాయని ఆయన అభిప్రాయపడ్డారు.