: ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో రాహుల్ గాంధీ సమావేశం


ఈశాన్య రాష్ట్రానికి చెందిన విద్యార్థి నిడో తానియా మృతి పెనుదుమారాన్ని రేపింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు తగ్గడం లేదు. మరోవైపు పార్లమెంటు కూడా నిడోతానియా హత్యోదంతంపై దద్దరిల్లింది. దీంతో ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కలిసి ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో సమావేశమయ్యారు. ఆందోళనల విరమణకు, మరోసారి ఇలాంటి హింసాయుత ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.

కాగా పార్లమెంటు ఉభయసభలు నిడోతానియా హత్యను ఖండించాయి. తానియా మృత్యోదంతాన్ని ఢిల్లీ హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. మరోవైపు ఈశాన్య రాష్ట్రాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఐదుగురు సభ్యుల కమిటీ నియమించింది.

  • Loading...

More Telugu News