: వారిది హైదరాబాద్ వాదమే కాని.. సమైక్యవాదం కాదు: జైపాల్ రెడ్డి
సీమాంధ్రులు తెలుగుజాతి అని విర్రవీగుతున్నారని... వారిది హైదరాబాద్ వాదమేకాని, సమైక్యవాదం కాదని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరిగిందనే అపవాదును తొలగించుకోవడానికి జీవోఎం ప్రయత్నిస్తోందని తెలిపారు. హైదరాబాద్, రవాణా పన్నులాంటి వాటిలో భాగం కోరడం రాజ్యాంగపరంగా సరికాదని చెప్పారు. గతంలో ముఖ్యమంత్రి కిరణ్ ఏం చెప్పారో గుర్తుచేసుకోవాలని... కిరణ్ తనకంటే ఒక తరం చిన్నవాడని తెలిపారు. ఎవరి రాజకీయం కోసం వారు నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు.