: లోక్ సభ రేపటికి వాయిదా


లోక్ సభ రేపటికి వాయిదా పడింది. ఉదయం ఒకసారి వాయిదా పడిన అనంతరం సభలో తెలంగాణ, సీమాంధ్ర నేతలు స్పీకర్ వెల్ లోకి వచ్చి నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అప్పటికే సభలో సీమాంధ్ర నేతలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టిన స్పీకర్ మీరాకుమార్, సభ అదుపులో లేకపోవటంవల్ల నోటీసులను చేపట్టలేకపోతున్నట్లు తెలిపారు. ఆ వెంటనే సభలో నెలకొన్న గందరగోళం మధ్యే ప్రభుత్వానికి సంబంధించిన బిల్లులను సభ్యులు ప్రవేశపెట్టారు. బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించి శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

  • Loading...

More Telugu News