: మొబైల్లో చార్జింగ్ అయిపోయిందా.. కిలోమీటరు నడిస్తే చాలు!
ఇంటి నుంచి బయటపడ్డాం. కొంత సేపటికి మొబైల్ ఫోన్ లో చార్జింగ్ నిల్. ఏం చేయాలి? చిన్న చిట్కా.. ఓపిక చేసుకుని 10 నిమిషాలు నావి కావనుకుని నడవండి చాలు. మొబైల్ ఫోన్ ఫుల్ గా చార్జ్ అయిపోతుంది. ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థి సుభ్రాంశు అద్భుత ఆవిష్కరణే ఇది. ఒత్తిడి శక్తితో విద్యుత్ ను ఉత్పత్తి చేసే పైజో సెల్ ను తయారు చేసి దాన్ని షూలో అమర్చాడు. అలాగే ఒక బ్యాటరీని కూడా షూలో ఏర్పాటు చేశాడు. నడక ద్వారా ఉత్పత్తయ్యే శక్తితో అది చార్జ్ అయింది. ఆ బ్యాటరీని ఫోన్లో వేసుకుని మళ్లీ నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చన్నమాట. ఇందుకోసం సుభ్రాంశు కేవలం 100 రూపాయలు మాత్రమే వెచ్చించాడు.