: వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం
గంటపాటు వాయిదా అనంతరం పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్యసభల్లో తెలంగాణ, సీమాంధ్ర నేతలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలోనే సీమాంధ్ర నేతలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ మీరాకుమార్ చదవి వినిపించారు. ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, సబ్బం హరి నుంచి తీర్మానాలు అందాయన్నారు. అయితే, సభ అదుపులో లేకపోవటం వల్ల తీర్మానాన్ని చేపట్టలేకపోతున్నట్లు స్పీకర్ చెప్పారు. అయితే, సభ్యుల నినాదాల మధ్యే ఇతర బిల్లులను ప్రవేశపెడుతున్నారు. మరోవైపు రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదాపడింది.