: సత్య గౌరవార్థం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సభ


మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య ఎంపిక కావడంతో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఆయన గౌరవార్థం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో అధ్యాపక వర్గం, పూర్వ, ప్రస్తుత విద్యార్థులు పలువురు పాల్గొన్నారు. ఒకప్పుడు సత్య చదువుకుంది బేగంపేటలోని ఈ స్కూల్లోనే. ఇక్కడ 1984లో సత్య 10వ తరగతి పూర్తి చేశాడు. తమ విద్యార్థి మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టబోతున్నారని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆర్ఎస్ ఖాత్రి గర్వంగా తెలిపారు. సత్య బ్యాచ్ మేట్ ఫయజ్ ఖాన్ మాట్లాడుతూ.. సత్య స్కూల్ క్రికెట్ జట్టులో బౌలర్ అని, అథ్లెటిక్స్ జట్టులోనూ సభ్యుడేనని, 100 మీటర్ల పరుగుపందెంలో పాల్గొన్నాడని తెలిపారు. సత్య 2001లో తాను చదివిన స్కూల్లో మైక్రోసాఫ్ట్ తరఫున రోబోటిక్స్ పై ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు.

  • Loading...

More Telugu News