: నేను పూర్తిగా అబూసలేం ప్రేమలో ఉన్నా: మోనికా బేడీ
కొన్ని రోజుల కిందట రైల్లో వెళుతున్నపుడు అండర్ వరల్డ్ డాన్ అబూసలేంకు ఓ మహిళతో నిఖా జరిగిందని ఆంగ్ల పత్రికలు, మీడియా వార్తలు ప్రచారం చేశాయి. అయితే, అది పూర్తిగా అబద్ధమని వెంటనే అతను ఓ ప్రకటన చేశాడు. దీనిపై సలేం మాజీ ప్రియురాలు, నటి మోనికా బేడీని సంప్రదించగా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిపింది. తన మనసులో ఇంకా అతనికి స్థానం ఉన్నట్లు సంకేతాలిచ్చింది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని తాను గౌరవిస్తానంది. అయితే, తమ ఇద్దరి (బేడీ, సలేం) మధ్య సంబంధంలేదన్న విషయాన్ని మాత్రం తిరస్కరించలేనని చెప్పింది. ఎందుకంటే, అది స్వచ్ఛమైన ప్రేమ అని పేర్కొంది. అయితే, ప్రస్తుతం తాను టీవీ షో, సినిమాల పనిలో బిజీగా ఉన్నానంది. 2002లో అరెస్టు అయిన తర్వాత తామిద్దరం కాంటాక్ట్ లో లేమని, అబూతో మాట్లాడి చాలా రోజులైందని మోనికా వెల్లడించింది.