: ప్రారంభమైన పార్లమెంటు ఉభయసభలు.. గంటపాటు వాయిదా
ఈ రోజు 11 గంటలకు పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. లోక్ సభ, రాజ్య సభ రెండింటిలోనూ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు గందరగోళం సృష్టించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. 'వియ్ వాంట్ జస్టిస్' అంటూ పోడియంలలోకి దూసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రారంభమైన రెండు నిమిషాలకే ఉభయసభలు గంటసేపు వాయిదా పడ్డాయి. దీంతో ఇవాళ కూడా ఉభయసభలు సజావుగా సాగుతాయనే నమ్మకం సన్నగిల్లిందనే చెప్పాలి.