: సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు


ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో సికింద్రాబాద్-విశాఖ మార్గంలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఖాజీపేట, వరంగల్ విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మార్గంలో తిరుగుతాయి.

08504 నంబర్ గల రైలు ఈ నెల 11, 18, 25, మార్చి 4, 11, 18, 25 తేదీలలో సికింద్రాబాద్ లో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 6.30 గంటలకు విశాఖ చేరుకుంటుంది.

08502 నంబర్ గల రైలు ఈ నెల 12, 19, 26, మార్చి 5, 12, 19, 26 తేదీలలో సికింద్రాబాద్ లో సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 6.30గంటలకు విశాఖకు చేరుకుంటుంది.

08503 నంబర్ గల రైలు ఈ నెల 10, 17, 24 మార్చి 3, 10, 17, 24 తేదీలలో విశాఖలో రాత్రి 7.05 గంటలకు బయల్దేరి మర్నాడు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఈ నెల 11, 18, 25, అలాగే మార్చి 11,18,25 తేదీలలో 08501 నంబరుగల ప్రత్యేక రైలు రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి మర్నాడు ఉదయం 11.45గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

  • Loading...

More Telugu News