: వైభవోపేతంగా కొనసాగుతున్న రథసస్తమి వేడుకలు
రథసప్తమి వేడుకలు రాష్ట్రంలోని పలు ఆలయాలలో ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ సూర్యదేవాలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో.. సూర్యనారాయణుడి మూలవిరాట్టుకు అర్చకులు క్షీరాభిషేకం చేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి.. సేవలో పాల్గొన్నారు. భక్తులు అశేష సంఖ్యలో స్వామి దర్శనం కోసం తరలివచ్చారు. మాజీ మంత్రి తమ్మినేని సీతారాం కూడా స్వామిని దర్శించుకున్నారు. రథసస్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై తిరువీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామికి చిన్నశేష వాహనసేవ నిర్వహించారు. చిన్నశేష వాహనంపై స్వామి తిరువీధుల్లో ఊరేగారు.